Saturday, December 15, 2018

'మాస్టర్ కీ': ఉత్తర భారతాన నూరేళ్ళ దళిత సామాజిక రాజకీయ ఉద్యమాలు : గుండిమెడ సాంబయ్య, తెలుగు అనువాదం: ఆశాలత



'మాస్టర్ కీ': ఉత్తర భారతాన నూరేళ్ళ దళిత సామాజిక రాజకీయ ఉద్యమాలు
సాంబయ్య సాగించిన మేధో ప్రయాణంలో భాగస్వామిని కావటం నాకెంతో సంతోషంగా ఉంది. అందుకే ఈ తెలుగు
అనువాద ప్రయత్నంతో నేను మనస్ఫూర్తిగా మమేకమవుతున్నాను. ఉత్తర, దక్షిణ భారతాల్లో దళిత రాజకీయ 
ప్రస్థానం కొంత భిన్నంగా ఉంది. వీటి మధ్యనున్న వ్యత్యాసాలపై ' నిజమైన' అవగాహనాపూరిత చర్చకు ఈ పుస్తకం  బలమైన భూమికగా నిలుస్తుందని నమ్ముతున్నాను. భారతదేశంలో (ఆ మాటకొస్తే మరెక్కడైనాగానీ) సామాజిక రాజకీయ పరిణామ క్రమాలను లోతుగా విశ్లేషించి విమర్శించే పని అందులో అంతర్భాగంగా ఉన్నవారు చేస్తేనే విలువ ఉంటుంది. ఈ కోణం నుంచి చూసినప్పడు సాంబయ్య చేసిన కృషికి, పుస్తకానికి అదనపు విలువ, బలం చేకూరతాయి. వర్తమాన భారత సామాజిక, రాజకీయ పరిణామాలపై ఆసక్తి ఉన్న, పరిశోధిస్తున్న వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడే సమర్ధ రచన. అంతేకాదు, దళిత రాజకీయాల పట్ల ఏ ప్రాంతంలో, ఇక్కడ  సానుకూలంగా,క్రియాశీలంగా ఉండే వారికైనా ఇది ఉపకరించే రచనే!  

'మాస్టర్ కీ': ఉత్తర భారతాన నూరేళ్ళ దళిత సామాజిక రాజకీయ ఉద్యమాలు

రచన :  గుండిమెడ సాంబయ్య
తెలుగు అనువాదం :  ఆశాలత
188 పేజీలు, వెల: రూ.150/-
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

Friday, November 9, 2018

అనేక రామాయణాలు - తెలుగు అనువాదం: పి.సత్యవతి



అనేక రామాయణాలు 
- తెలుగు అనువాదం: పి.సత్యవతి

''రాముడిని ఆదర్శానికి ప్రతీకగా చేసి, జనరంజకంగా చేప్పే రామాయణాలనే
హిందుత్వవాదులు ఇష్టపడతారు. పిల్లలని నిద్రపుచ్చడానికి చెప్పే కథలాగా,  విన్నదంతా నమ్మేసి నిద్రపోయేలా చేసేటట్లువుండే రామాయణమే వారికి నచ్చుతుంది''

- సుగత శ్రీనివాసరాజు (పత్రికా రచయిత్రి)

భారతదేశ చరిత్రలో అనేక రామ కథలున్నాయి.

చాలామంది పండితులు వాల్మీకి రామాయణమే ప్రామాణికమైనదిగా భావిస్తున్న తరుణంలో, ఈ సంకలనంలోని వ్యాస రచయితలు ఆ అభిప్రాయంతో విభేదిస్తారు. అనేక రామాయణాల గురించి ప్రస్తావించి వాటిని విశ్లేషిస్తారు. స్థలకాలాలు, రాజకీయ నేపథ్యం, ప్రాంతీయ సాహిత్య సాంప్రదాయాలు, మతాచారాలు, పాఠకుల, శ్రోతల అభిరుచులు, సృజన ప్రక్రియ మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని ఎన్ని రామాయణాలు రూపుదిద్దుకున్నాయో సోదాహరణంగా నిరూపిస్తారు. ...

కొంతమంది ఆధ్యాత్మిక ప్రయోజనానికి, కొంతమంది రాజకీయ ప్రయోజనాలకు రామాయణాన్ని పునర్విశ్లేషించారు. చరిత్ర కారులకూ, దక్షిణాసియాపై అధ్యయనం చేసే  పండితులకూ, జానపద సాహిత్యకారులకూ, సామాజిక సాంస్కృతిక పరిణామాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేవారికీ ఈ వ్యాసాలు ఒక కొత్తచూపునిస్తాయి.

1991లో ప్రచురితమైన ఈ ''మెనీ రామాయణాస్‌'' పుస్తకంలో ఎ.కె.రామానుజన్‌ వ్రాసిన ''మూడువందల రామాయణాలు: ఐదు ఉదాహరణలు'' అనే వ్యాసాన్ని 2008వ సంవత్సరంలో ఢిల్లీ యూనివర్సిటీ వారు చరిత్ర విభాగంలో ఒక బోధనాంశంగా ప్రవేశ పెట్టినప్పుడు అది వివాదానికి దారితీసింది.

హిందూ మితవాద విద్యార్థి కార్యకర్తలు ఈ పాఠ్యాంశాన్ని తొలగించాలని కోరుతూ అందుకు నిరసనగా చరిత్ర విభాగంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అప్పుడు నలుగురు ఎకడెమిక్‌ సభ్యులతో ఒక కమిటీ వేసి ఈ వ్యాసం బోధనాంశంగా వుంచాలా తొలగించాలా అనే విషయంపై విచారణ జరిపించమని సుప్రీంకోర్టు యూనివర్సిటీని ఆదేశించింది.

అందులో ముగ్గురు సభ్యులు ఈ వ్యాసం, సంబంధిత కోర్సుకు చాలా ముఖ్యమైనదని, అందులో వివాదాస్పదమైన అంశం ఏమీ లేదనీ అభిప్రాయపడ్డారు. నాలుగవ సభ్యుడు కూడా ఈ వ్యాసంలో తప్పేమీ లేదనీ కాకపోతే అది విద్యార్థుల మనోభావాలను గాయపరిస్తే తొలగించవచ్చనీ అన్నాడు.

కమిటీ 3-1 ఓట్లతో అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ అకడెమిక్‌ కౌన్సిల్‌ ఆ తీర్పును బేఖాతరు చేస్తూ పాఠాన్ని తొలగించింది. అనేకమంది చరిత్రకారులో మేధావులూ దీనిపై ఆందోళన చేసారు. కమిటీ అట్లా లొంగిపోవడాన్ని తప్పుపట్టారు.

పౌలా రిచ్మన్‌ సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకంలో ఏడు వ్యాసాలున్నాయి.
వీటిని పి. సత్యవతి తెలుగులో అనువదించారు.

ఆంగ్ల మూలం : 
MANY RAMAYANAS : The Diversity of a Narrative Tradition in South Asia, edited by Paula Richman, University of California Press, Bderkeley, Los Angeles, USA, 1991

పేజీలు : 160, ధర : రూ.150/-



నవంబర్ 11 ఆదివారం ఉదయం 10-30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు  
హైదరబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం (దొడ్డి కొమురయ్య హాల్)లో 
జరిగే ఒక సాహితీ మిత్రుల సమావేశంలో ఈ పుస్తక అవిష్కరణ ఆ తరువాత చర్చ వుంటుంది. 
పి. సత్యవతి గారు, హెచ్ బి టి మిత్రులు, పుస్తకాభిమానులు పాల్గొంటారు. 
వివరాలకు ఫోన్ చేయండి : 
040 23521849
9441559721  



Monday, July 30, 2018

తెలుగునాట దళిత రాజకీయ కార్యచరణ: గుండిమెడ సాంబయ్య, తెలుగు అనువాదం: ఆశలత

తెలుగునాట దళిత రాజకీయ కార్యచరణ

దళితులు ఉత్తర ప్రదేశంలో రాజకీయ అధికరాన్ని ఎలా సాధించగలిగరు? ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణల్లో ఎందుకు విఫలమయ్యారు?భారతదేశంలోని దళిత రాజకీయాలను ఈ రెండు పుస్తకాలు అద్భుతంగా విశ్లేషిస్తాయి. రాజకీయ అధికారం, సామాజిక సమానత్వం, న్యాయం కోసం సాగే దళిత ఉద్యమానికి ఇవి అద్దం పట్టాయి.

తెలుగునాట దళిత రాజకీయ కార్యచరణ
రచన :  గుండిమెడ సాంబయ్య
తెలుగు అనువాదం : 
 ఆశలత
190 పేజీలు, వెల: రూ.150/-
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

మార్క్స్‌ రాసిన పెట్టుబడి: డేవిడ్‌ స్మిత్‌ ఫిల్‌ ఇవాన్స్‌, తెలుగు అనువాదం: రాచమల్ల రామచంద్రరెడ్డి, ఎన్‌. వేణుగోపాల్‌


మార్క్స్‌ రాసిన పెట్టుబడి
ఏమిటి. మార్క్స్‌ రాసిన పెట్టుబడి చదవడమే? మూడు సంపుటాలు. అనుబంధంగా మళీ మూడు సంపూటాలు. మొత్తం నాలుగు వేల పేజీలు అమ్మో చదవడానికి ఎంత సమయం
కావాలి! అర్ధం చేసుకోవడానికి ఎంత శ్రమ కావాలి! అని చాలా మంది అనుకోవచ్చు భయపడవచ్చు. కాని, పెట్టుబడి కోరకరాని కోయ్య అనే అపోహను డేవిడ్‌ స్మిత్‌ ఫిల్‌ ఇవాన్స్‌లు ఈ
పుస్తకంలో పటాపంచలు చేశారు. డేవిడ్‌ స్మిత్‌ పెట్టుబడిలో మౌలిక అంశాలను అత్యంత సులభంగా వివరించగా, ఫిల్‌ ఇవాన్స్‌ ఆ వివరణకు తగిన హస్యస్ఫోరకమైన బొమ్మలు వేశారు.

మార్క్స్‌ రాసిన మహా గ్రంథంలోని కీలక భావాలను, చమత్కారాన్నీ అపారమైన       జీవ శక్తినీ సంపూర్ణంగా పాఠకులకు అందించారు.
మార్క్స్‌ రాసిన పెట్టుబడి
రచన : డేవిడ్‌ స్మిత్‌ ఫిల్‌ ఇవాన్స్‌
తెలుగు అనువాదం : 
 రాచమల్ల రామచంద్రరెడ్డి, ఎన్‌. వేణుగోపాల్‌
210 పేజీలు, వెల: రూ.200/-
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

కలల రైలు: కాల్సన్‌ వైట్‌హెడ్‌, తెలుగు అనువాదం: శాంతసుందరి


కలల రైలు
ఇది అసాధారణ రచన ప్రపంచంలో అత్యుత్తమ సాహిత్యానికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక పుస్కారాల్లో దాదాపు అన్నింటినీ దక్కించుకోన్న మేలిమి రచన ఇది. అలాగే బరాక్‌ ఒబామా నుంచి ఓప్రావిన్‌ఫ్రే వరకు ఎంతో మందిని ఆకట్టుకుని, వారి మనసులపై బలమైన ముద్ర వేసిన అరుదైన నవల ఇవని అట్ట మీద వ్యాఖ్యలను చూస్తే తేలికగానే అర్ధమవుతుంది. మరి అందర్ని ఇంతగా కదిలించి, ఆధునిక సాహితీ జగత్తులో దీన్ని ఉత్తమ సృజనగా నిలబెట్టిన అంశాలు ఇందులో ఏమున్నాయి. ''అద్భుతమైన పుస్తకం జాతుల గురించీ, అమెరికన్‌ చరిత్ర గురించీ కొన్ని అంశాలను బలంగా చర్చకు పెట్టిన పుస్తకం''....



కలల రైలు
రచన : కాల్సన్‌ వైట్‌హెడ్‌
తెలుగు అనువాదం :శాంతసుందరి 

287 పేజీలు, వెల: రూ.250/-
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

Saturday, July 28, 2018

Sambaiah Gundimeda's book Dalit Politics in Contemporary India



Anveshi Research Centre for Women's Studies

Invites you to a book discussion of 
Sambaiah Gundimeda's book Dalit Politics in Contemporary India 
On 2nd August, at 4:00 pm
At Anveshi Research Centre for Women's Studies
Discussants: 
M. Parthasarathi
Assistant Professor, Cultural Studies
and
Kaki Madhava Rao
Formerly Chief Secretary, Government of Andhra Pradesh
Chairperson: Rama Melkote

HyDerabad book Trust
040-2352 1849

Wednesday, March 21, 2018

భారతదేశంలో నాజైలు జీవితం రచన : మేరీ టైలర్‌

Add caption
ఈ పుస్తకం చదవటం నాకొక గొప్ప అనుభవం. వేరొక దేశానికి చెందినామె మనదేశంలో జనం గురించీ, ఇక్కడి పరిస్థితుల గురించీ, సాగుతున్న పోరాటాల గురించీ మనకు తెలియని విషయాలు చెపుతూ వుంటే మనకు కలిగేది ఆశ్చర్యమే అయినా, కలగవలసింది ఆశ్చర్యం కాదు. సిగ్గు!

- కాళీపట్నం రామారావు



అనుకోని పరిస్థితుల్లో బీహారులో జైలు జీవితం గడిపిన బ్రిటీషు  పౌరురాలు మేరీ టైలర్‌ అనుభవాలకు అక్షరరూపమే ఈ పుస్తకం. ఐదేళ్లపాటు హజారీబాగ్‌ జైలులో ఆమె ఎంతోమంది ఖైదీలతో కలిసిమెలసి ఉన్నారు. ఈ సమయంలో సునిశితమైన పరిశీలనా దృష్టితో, సాటి మనుషుల పట్ల అవ్యాజమైన ప్రేమాసక్తులతో వారినుంచి తెలుసుకొన్న విభ్రాంతికర వాస్తవాలెన్నో ఈ పుస్తకంలో ఆమె మన కళ్ల ముందుంచారు. విస్తృతంగా పరుచుకున్న దారిద్య్రం, నిరంకుశంగా సాగిపోతున్న రాజకీయ దమనకాండల మధ్య నలిగిపోతున్న జనజీవితాల  గురించీ, న్యాయ-జైళ్ల వ్యవస్థల్లో పాతుకుపోయిన అమానుష ధోరణుల గురించీ ఆమె ఆర్తితో రాసిన అనుభవాలు మనల్ని తట్టి లేపుతాయ.

భారతదేశంలో నాజైలు జీవితం 

రచన : మేరీ టైలర్‌
తెలుగు అనువాదం: సహవాసి
248 పేజీలు వెల: 200/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com



Friday, February 9, 2018

బషాయి టుడు - మహాశ్వేతాదేవి నవల


బషాయి టుడు 
- మహాశ్వేతాదేవి నవల 

... పీడిత, తాడిత జన విముక్తి కోసం నడుంకట్టిన సున్నితమైన వ్యక్తులు నా రచనల్లో కీలక పాత్రధారలుగా కనిపిస్తారు. ... జీవితం అంకగణితం కాదు. మనిషి రాజకీయ క్రీడ కోసం రూపొందలేదు. తన హక్కులన్నీ చెక్కుచెదరకుండా హాయిగా జీవించాలన్న మనిషి తపనను సఫలం చెయ్యాలన్నదే ప్రతి తరహా రాజకీయాలకూ ధ్యేంగా వుండాలని నేను నమ్ముతాను. పార్టీ ప్రయోజనాల పెంపుదలకు మాత్రమే పరిమితమైన రాజకీయాలు వర్తమాన సామాజిక వ్యవస్థను మార్చగలవంటే నేను నమ్మను.

స్వాతంత్య్రం సిద్ధించిన నలభై ఒక్క (...)  ఏళ్ల తరువాత కూడా తిండికి, నీళ్లకు, భూమికి నోచుకోక అప్పుల్లో కట్టుబానిసత్వంలో నా దేశ ప్రజలు అల్లాడి పోవడం నా కళ్లతో చూస్తున్నాను. ఈ అమానుష నిర్బంధాలనుంచి నా ప్రజల్ని విముక్తుల్ని చెయ్యలేని వ్యవస్థకు వ్యతిరేకంగా జాజ్వల్యమాన సూర్యబింబంలా ప్రజ్వరిల్లుతున్న ఓ ఆగ్రహమే నా రచనలన్నింటికీ ప్రేరణ, స్ఫూర్తి.

వామపక్ష. మితవాద పక్షాలు ఏవైనా గానీ అన్నీ ప్రజాసామాన్యానికిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమైనవే. నా ఈ జీవితకాలంలో పరిస్థితి గుణాత్మకంగా మారుతుందనే  ఆశారేఖ పొడగట్టడంలేదు. అందుకే నేను అనాధలు, అభాగ్యుల పక్షాన నిలబడి నా శాయశక్తులా కలంతో పోరాటం కొనసాగిస్తున్నాను.  ఆవిధంగా నాకు నేను సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తే తలదించుకోవాల్సిన ఆగత్యం ఏనాడూ కలగబోదు. ఎందుకంటే అందరు రచయితలూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్లు.

...................................................................................................................- మహాశ్వేతాదేవి
.........................................................................బషాయి టుడు నవల 'నా మాట' నుంచి (1990)

...      ....        ....          ....

... నిజమైన నక్సలైట్‌ ఉద్యమం నడిపిన ఆదివాసీ హీరోలు అనేకమందిలో ఒక బషాయ్‌ టుడును తన గిరిజన కథానాకుడుగా మహాశ్వేతాదేవి రూపొందించారు.

అతడు నక్సలైట్‌ ఉద్యమానికే కాదు రాజ్యాంగబద్ధమైన రాజకీయపక్షాలకు సైతం ఎడంగా నిలబడి వ్యవసాయ కార్మికుల బాగే ఏకైక లక్ష్యంగా మొండిగా పోరాటం సాగించడానికే బద్ధుడయ్యాడు. ఆమె ఒకసారి బషాయ్‌ టుడును సృష్టించాక, కాల్పనిక కథానాయకుడిగా అతణ్ణి ఎదగనిచ్చారు.

ప్రతి ఎన్‌కౌంటర్‌లో అతను మరణిస్తాడు.
మరో పోరాటం నడిపించడానికి మళ్లీ లేచివస్తాడు.
కథా కథనం పొడవునా ఈ కల్పనా చమత్కృతి దర్శనమిస్తూ కథకొక పొందికను, ఏకతను సంతరించిపెట్టింది.

..............................................................................................- సమిక్‌ బంధోపాధ్యాయ 
..................................................................................బషాయ్‌ టుడు 'పరిచయం' నుంచి


మహాశ్వేతా దేవి
మహాశ్వేతా దేవి సుప్రసిద్ధ బెంగాలీ రచయిత మనీష్ ఘటక్ పుత్రిక.
14 జనవరి 1926లో జన్మించారు. 28 జూలై 2016లో మరణించారు.
శాంతినికేతన్, కలకత్తా విశ్వ విద్యాలయాల్లో చదివారు.
1947లో ప్రముఖ నాటక కర్త, నటుడూ అయిన బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకున్నారు.
పదిహేడు సంవత్సరాలు ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేసి పూర్తిస్థాయి సామాజిక రచనా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 1982 లో స్వచ్చంద పదవీవిరమణ చేసారు.
సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీట్ అవార్డు, రామన్ మెగసెసే అవార్డు, పద్మశ్రీ, పద్మ విభూషణ్ వంటి అనేక పురస్కారాలను అందుకున్నారు.



బషాయ్‌ టుడు నవల
రచన : మహాశ్వేతాదేవి
తెలుగు అనువాదం: ప్రభంజన్‌ 
ఆంగ్లమూలం: Thema, 1990, translated by Gayatri Spivak and Samik Bandopadhyay

మొదటి ముద్రణ: నవంబర్‌ 1997
పునర్ముద్రణ: జనవరి 2018

138 పేజీలు వెల: రూ. 120/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,  

ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్‌,  
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006 

ఫోన్‌ : 040 23521849


Email ID :    hyderabadbooktrust@gmail.com











Sunday, January 28, 2018

మడి విప్పిన చరిత్ర భారతీయ సమాజంలో ఆధిపత్యం-ప్రతిఘటన

మడి విప్పిన చరిత్ర

భారతీయ సమాజంలో ఆధిపత్యం-ప్రతిఘటన


గురువుగా ద్రోణాచార్యుని ప్రతిభా కౌశలం గురించి, మంత్రిగా కౌటిల్యుని సామర్థ్యం గురించి
చరిత్ర పుస్తకాలలో చదివే పిల్లలకు, ఆ ఇద్దరూ వాస్తవానికి ఏ నిర్వచనం ప్రకారం చూసినా మహా కపటులన్న విషయం తెలియజెప్పాలి.

సత్యవర్తన, న్యాయం, సర్వజనుల సమానత్వ భావనలకు ప్రాతినిధ్యం వహించే హిందూమతం ఈ దేశపు ప్రత్యేకత అని చెప్పే సమయంలో అది కులం, పితృస్వామ్య వ్యవస్థలతో దళిత బహుజనులను, స్త్రీలను ఏవిధంగా అణచివేసిందో కూడా వివరించాలి.

గాంధీ జీవిత చరిత్రను శ్లాఘించే రచనలు చేసినప్పుడు ఆయన కులవ్యవస్థను, బ్రాహ్మణతత్వాన్ని బలపరిచాడన్న వాస్తవాలను విస్మరించకూడదు.

''అగ్రవర్ణాల వారికి సేవలు చేయటాన్ని తన మతపరమైన విధిగా భావించి, ఎప్పటికీ ఆస్తిపాస్తులు సంపాదించని శూద్రుడు ప్రపంచం నిశాల్లుఅ అర్పించడానికి అర్హుడు. దేవతలు అలాంటి శూద్రుడికి ఉత్కృష్టమైన ఆశీస్సులు అందజేస్తారు'' అని రాశాడు గాంధీ!

మనకు గొప్పగా, మంచిగా చూపించిన దాని వెనుక ఎంతో మోసం కపటత్వం దాగివున్నాయి.
....
ఆధ్యాత్మిక సంస్కృతి పేరుతో బ్రాహ్మణవాదం శతాబ్దాలుగా ప్రచారంలో పెట్టిన కథనం దానికున్న క్రూరత్వాన్ని దాచిపెట్టడానికి బాగానే దోహదపడింది. కానీ కులాలని, బ్రాహ్మణత్వపు వికృత స్వభావాలని దాచడం వల్ల దాచేవారి ప్రయోజనాలు మాత్రమే నెరవేరతాయి.

కాబట్టి మనం దాన్ని విప్పి చూపాల్సిందే.

దానిపై వాదనలు చేయాల్సిందే.

మనం ఈ పనుల్ని ఇప్పటివరకు దీనివల్ల జరుగుతూ వస్తున్న అన్యాయాలు, క్రూరత్వం, చీలికలను గురించి చర్చించుకోవడానికి మాత్రమే చేయకూడదు.

అంతకంటే ప్రధానంగా పీడితులను ఏకం చేసి, అణచివేత నుంచి దోపిడి నుంచి విముక్తి చేయడం కోసం కూడా ఇందుకు పూనుకోవాలి. ఎందుకంటే గతం ఒక 'చరిత్ర'గా మిగిలిపోలేదు. అది వర్తమానం లోనూ కొనసాగుతోంది.

- బ్రజ్‌ రంజన్‌ మణి
(2015 ముద్రణకు ముందుమాట నుంచి)



మడి విప్పిన చరిత్ర 
భారతీయ సమాజంలో ఆధిపత్యం-ప్రతిఘటన
- బ్రజ రంజన్ మణి

ఆంగ్ల మూలం : Debrabminising History : Dominance and Resistance in Indian Society, 

తెలుగు అనువాదం : టంకశాల అశోక్‌

432 పేజీలు, వెల: రూ.300/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com









Thursday, January 18, 2018

మడి విప్పిన చరిత్ర - పుస్తకావిష్కరణ సభ , చర్చ



మడి విప్పిన చరిత్ర
Inherited and Hindutva Threats to Indian Democracy

రచన : బ్రజ్ రంజన్ మణి
తెలుగు అనువాదం : టంకశాల అశోక్

పుస్తకావిష్కరణ సభ , చర్చ
27 జనవరి 2018 సాయంత్రం 5-30 కి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్ లో





హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌