Tuesday, September 1, 2015

నేను కమ్యూనిస్టుని - అతిసాధారణుడు సీకే జ్ఞాపకాలు - గీతా రామస్వామి



నేను కమ్యూనిస్టుని - అతిసాధారణుడు సీకే జ్ఞాపకాలు

సీకే నారాయణరెడ్డి (1925-2013) నిశ్శబ్దంగా పనిచేసుకుటూపోయే గొప్ప పనిమంతుడు. స్వాతంత్య్ర సమరయోధుడు,తలకెత్తుకున్న విలువలను తనువు చాలించేదాకా నిలబెట్టుకున్న కమ్యూనిస్టు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు. అతిసాధారణంగా కనిపిస్తూనే గొప్ప మార్పు కోసం జీవితపర్యంతం శ్రమించిన ఇటువంటి మౌన ఋషుల, మానవతా మూర్తుల చరిత్ర బయటకు రావటం అవసరమని భావించి ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెస్తోంది హెచ్‌బీటీ

.... ... ...

రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎదురుగా ఎక్కడన్నా అరటిపండు తొక్క కనబడితే పనిగట్టుకుని అక్కడి వరకూ వెళ్లి.. వంగి, దాన్ని చేత్తో తీసి దూరంగా చెత్తకుప్పలో పడేసే నిండు వృద్ధుడిని చూస్తే మనకు ఏమనిపిస్తుంది?

అసలు అలాంటి వారు ఉంటారా అనిపించటం సహజం.

ఎందుకింత, అవసరమా అంటే 'జనం జారి పడిపోరూ' అనేవాడాయన.

ఇదొక్కటే కాదు.

స్వాతంత్య్ర సమరయోధుడు, జీవిత పర్యంతం కమ్యూనిస్టుగా జీవించినవాడు, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన సి.కె.నారాయణరెడ్డి  (చల్లా కృష్ణ నారాయణరెడ్డి) గురించి చెప్పటం మొదలుపెడితే ఇలాంటి విషయాలు ఇంకెన్నెన్ని ప్రస్తావనకు వస్తాయో లెక్కలేదు.

పట్టణాల్లో పేదలు ఎదుర్కొంటున్న పిచ్చి కుక్కల బెడద, గ్రామాల్లో పేదలను వేధిస్తున్న ఫ్లోరోసిస్‌ వ్యాధి, శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల వంటి ఎవరికీ పట్టని, ఎవరి దృష్టికీ రాని అనేకానేక 'చిన్న చిన్న' విషయాలను ఆయన ఎంతో శ్రద్ధగా పట్టిరచుకునేవాడు.

ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో దళితులకు ప్రవేశాన్ని నిరాకరిస్తుండటం, శాసన సభ్యులు, మాజీ శాసనసభ్యులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తమకు తామే జీతభత్యాలను, ఇతర సదుపాయాలను పెంచుకోవడం వంటి - కమ్యూనిస్టులు తమకు సాంప్రదాయేతరమైన విషయాలుగా భావించే - ఎన్నో సమస్యలపై ఆయన నిబద్ధతతో పోరాడాడు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా తప్పనిసరై ఇంటికి పరిమితమవ్వాల్సి వచ్చేంత వరకూ కూడా ఆయన సామాజిక కార్యకర్తలందరికీ చిరపరిచితుడు. నిత్యం ఏదో ఒక సహాయం కోరుతూ ఎందరో ఆయన్ని కలిసేవారు. ఆయన కూడా న్యాయమైన ప్రతి సమస్యనీ ఎంతో శ్రద్ధగా కడదాకా పట్టించుకుని, ఆ పని పూర్తయ్యే వరకూ విశ్రమించేవాడు కాదు. ....









నేను కమ్యూనిస్టుని  - అతిసాధారణుడు సీకే జ్ఞాపకాలు

- గీతా రామస్వామి

వెల: రూ. 30


పతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006

ఫోన్‌ : 040 23521849
ఇ మెయిల్ ఐ డి : hyderabadbooktrust@gmail.com

 








No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌