Tuesday, October 7, 2008

పగటి కల ... గిజూభాయి ... పిల్లలకు ఆదర్శంగా నిలిచే, ప్రేరణనందించే భావి ఉపాధ్యాయులను, ఆహ్లాదకరమైన విద్యావిధానాన్ని అందించాలి.


ప్రస్తుత ప్రాథమిక పాఠశాలలో బోధించబడుతున్న విషయాలు, విధానాలు బాలలకు చాలా హానికరంగా వున్నాయి. విద్యార్హతను పరీక్షలతోనూ, బహుమతులతోనూ, పోటీలతోనూ, కుస్తీపట్లతోనూ కొలుస్తున్నారు. ఈ రకపు చదువుసంధ్యల ఫలితాలే దెబ్బలాటలు, ఈర్ష్య, ద్వేషం, అశాంతి, అసంతృప్తి, అదుపుతప్పటం, పరిస్థితి అస్తవ్యస్థంగా మారిపోవడం.
ఈ విధానానికి స్వస్తిపలకాలని, ఓ నూతన విధానాన్ని రూపొందించాలని ప్రఖ్యాత గుజరాత్‌ విద్యావేత్త గిజుభాయి ఎన్నో ప్రయోగాలు చేశారు. సత్ఫలితాలను సాధించారు. ప్రాథమిక విద్యారంగంలో మౌలికమైన మార్పులెన్నో ప్రవేశపెట్టారు. వాటిని తాను ఆచరించి రుజువుచేశారు. ఆయన తన పద్ధతుల్లో స్వయంగా దాదాపు ఆరు వందల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి విద్యాకార్యకర్తలుగా తీర్చిదిద్దారు.
గిజూభాయి పూర్తిపేరు గిరిజాశంకర్‌ భగవాన్‌జీ బగేకా. ఆయనను గుజరాత్‌లో ప్రజలంతా మూంచ్‌ వాలీ మా (మీసాలున్న అమ్మ) అని ఎంతో ప్రేమగా పిలిచేవారు. ఆయనకు పెద్ద మీసాలుండేవి. మాతృత్వానికి ఒక కొత్త కోణాన్ని చూపిన ఆయన వ్యక్తిత్వాన్ని ఆ పిలుపు ప్రేమగా ప్రతిబింబిస్తుంది.
కేవలం ఉద్యోగం జీతం డబ్బులు అనే పరిమిత స్థాయిలో జడంగా బతికేసే ఉపాధ్యాయులను కాకుండా ఆదర్శంగా, ప్రేరణ నిచ్చే వ్యక్తిత్వంతో, ధైర్యంతో ఒక ఆశయం కోసం జీవించే భావి ఉపాధ్యాయులను సృష్టించడమే గిజుభాయి పగటికల.

పగటి కల
గిజుభాయి
హిందీ మూలం: దివా స్వప్న
తెలుగు అనువాదం : పోలు శేషగిరి రావు
84 పేజీలు, వెల : రూ.16

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌